: నేపాల్లో మోడీ ఆలయ సందర్శనపై వివాదం


నేపాల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పశుపతి ఆలయంలో పూజలు నిర్వహించడంపై వివాదం రేగింది. నేడు లోక్ సభలో ఈ అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదిప్ బందోపాధ్యాయ లేవనెత్తారు. ప్రధాని గతవారం ఈద్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పి ఉండాల్సిందని అన్నారు. "నేపాల్లోని ఓ దేవాలయంలో ఆయన పూజలు చేయడాన్ని మేమూ హర్షిస్తాం. 'సర్వ ధర్మ సమభావ' నినాదాన్ని మేము నమ్ముతాం. రంజాన్ సందర్భంగా ప్రధాని దేశప్రజలకు శుభాకాంక్షలు చెబితే బాగుండేది" అని అభిప్రాయపడ్డారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సభ వాయిదా పడింది.

  • Loading...

More Telugu News