: రుతుపవనాల కదలికతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ పై తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లోని అంబికాపూర్ కు వంద కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు, గార్లలో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం, ఇల్లెందు, చంద్రుగొండలో 5 సెం.మీ, పాల్వంచ, జూలూరుపాడు, బయ్యారం, డోర్నకల్, నర్సంపేట, ఆసిఫాబాద్, నిర్మల్ లో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లో 3 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.