: కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిన పాకిస్థాన్
భారత్ - పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయినా, పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి ఉన్న భారత్ స్థావరాలపై పాక్ కాల్పులు జరిపింది. అయితే, వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ చర్యలను సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ ఓ వైపు భారత్ కు స్నేహ హస్తం అందిస్తూనే... మరో వైపు ఇలాంటి చర్యలకు తెగబడుతోంది.