: సిడ్నీ టుస్సాడ్ మ్యూజియంలో కూడా బిగ్ బీ!
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కు టుస్సాడ్ మ్యూజియం నుంచి అరుదైన గౌరవం దక్కనుంది. త్వరలో సిడ్నీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మను పెట్టనున్నట్లు మ్యూజియం వర్గాలు అధికారికంగా తెలిపాయి. బిగ్ బీ బొమ్మను ఇంటరాక్టివ్ సెట్టింగ్ లో ఏర్పాటు చేయనున్నారని... దాంతో అభిమానులు దానికి సమీపంగా వెళ్లి ఆయనను కలసిన అనుభూతిని పొందవచ్చనీ అంటున్నారు. ఇప్పటికే మ్యూజియంలో ఉన్న కెప్టెన్ కుక్, డాన్ బ్రాడ్ మన్, నికోల్ కిడ్మన్, హగ్ జాక్మన్, జానీ డెప్, లేడీ గాగా తదితరుల మైనపు బొమ్మల సరసన ఈ బొమ్మను పెట్టనున్నారు. ఈసారి టుస్సాడ్ మ్యూజియంలో ఏ బొమ్మ ఏర్పాటు చేయాలంటూ, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ నెట్ పోల్ లో ఎక్కువమంది బిగ్ బీకే ఓటేశారని మ్యూజియం జనరల్ మేనేజర్ క్విన్ క్లార్క్ వెల్లడించారు. ఇప్పటికే లండన్లోని టుస్సాడ్ మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మ వుంది!