: హైదరాబాదులో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేస్తోన్న జగన్


హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం.45 లో ఉన్న వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఖర్చులు తగ్గించాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం ఉన్న కార్యాలయానికి ప్రతి నెల కోటి రూపాయల అద్దెను చెల్లిస్తున్నామని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ఎలక్షన్ల తర్వాత పొదుపు చర్యలలో భాగంగానే ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఖాళీ చేస్తున్నామని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే, ప్రస్తుతం ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నిశ్చయించుకున్నామని ఆ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న భవనంలోంచి జగన్ నివాసముంటున్న లోటస్ పాండ్ కు మార్చనున్నారు. లోటస్ పాండ్ భవన సముదాయంలో ఓ బిల్డింగ్ ఖాళీగా ఉంది. ఈ భవనాన్ని ఇకపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంగా మార్చనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధానిని ప్రకటించగానే... అక్కడ వైఎస్సార్సీపీకి ఓ భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News