: రిషికేష్ శ్రీవారి ఆలయంలో దోపిడీ దొంగల ఘాతుకం... సెక్యూరిటీ గార్డు హత్య


ఉత్తరాఖండ్ లో ఉన్న పవిత్ర రిషికేష్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రిషికేష్ లో ఉన్న టీటీడీ శ్రీవారి ఆలయంలో దోపిడీకి విఫలయత్నం చేశారు. గుడి తలుపులు పగులగొట్టి, గర్భాలయంలో చొరబడేందుకు విఫలయత్నం చేశారు. కానీ, వీరి ప్రయత్నాలు సఫలం కాలేదు. అయితే, వీరు గర్భాలయాన్ని పగులగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు... అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు శర్మ అడ్డుకున్నాడు. దీంతో, వారు సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేశారు. దీంతో, ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు హుటాహుటిన రిషికేష్ బయల్దేరారు.

  • Loading...

More Telugu News