: మరో అవినీతికి పాల్పడుతున్న భారత నల్లకుబేరులు


భారతీయ నల్లకుబేరులు మరో అవినీతికి తెరతీశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో నల్లధనం భారీగా దాచారని పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నల్లధనాన్ని వెలికితీయడానికి తీవ్రమైన కృషి చేయాలని భారత ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇంతలో స్విట్జర్లాండ్‌ నుంచి బంగారం, వెండి పెద్దఎత్తున దిగమతి కావడం పలు అనుమానాలను బలపరుస్తోంది. నగదు రూపంలో కాకుండా బంగారం రూపంలో భారత్‌కు నల్లకుబేరులు తమ ధనాన్ని తరలించుకుంటున్నారని నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. జూన్‌లో స్విట్జర్లాండ్‌ నుంచి 390 కోట్ల (దాదాపు 26,000 కోట్ల రూపాయలు) స్విస్ ఫ్రాంక్ ల బంగారం వెండి ఎగుమతి కాగా, అందులో భారత్‌ వాటా 42 శాతం (11,000 కోట్ల రూపాయలు) కావడం విశేషం. ఈ ఏడాది 3,210 కోట్ల స్విస్‌ ఫ్రాంక్‌ ( 2.15 లక్షల కోట్ల రూపాయలు) లు ఉండగా, భారత్‌ వాటా 50,000 కోట్ల రూపాయలు కావడం ఆందోళనను పెంచుతోంది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల ధనం సమాచారం అందజేయాలంటూ స్విస్ ప్రభుత్వంపై భారత్‌ ఒత్తిడి పెంచుతుండడంతో తాజా వివరాలు వెలువడడం ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున బంగారం, వెండి దిగుమతి కావడంలో భారతీయ అధికారుల సహకారం తప్పని సరి. నల్లధనం వెలికితీస్తామంటూ ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా సహకరించడం మానేసిన అధికారులు నల్ల కుబేరులతో కలిసి మరో అవినీతికి తెరతీసినట్టు కనబడుతోంది. నల్లధనం వెలికితీతలో తమ పూర్తి సహకారం ఉంటుందని స్విస్ ప్రభుత్వం స్పష్టం చేయడానికి తోడు భారత బృందాన్ని స్విట్జర్లాండ్ ఆహ్వానించడంతో నల్లకుబేరులు సర్దుకుంటున్నారు. స్విస్ అకౌంట్లలో దాచుకున్న ధనాన్ని బంగారం, వెండి రూపంలో భారత్ కు రప్పించుకుంటున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నల్ల ధనం మనీ ల్యాండరింగ్ రూపంలో భారత్ కు ప్రవహిస్తున్నట్టు నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News