: పోలవరం పనులకు ఆటంకం
తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ట్రాన్స్ స్టాయ్ కంపెనీకి చెందిన వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో, ఆగ్రహించిన గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో పోలవరం పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్క్స్ పనులు జరుగుతున్నాయి.