: నటి మల్లికా శెరావత్ కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ కు హైదరాబాదులోని ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మల్లిక నటిస్తున్న 'డర్టీ పాలిటిక్స్' అనే హిందీ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో ఆమె జాతీయ జెండాను ఆచ్చాదనగా కప్పుకుని ఉంటుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మానవ హక్కుల కార్యకర్త టి.ధన్ గోపాల్ రావ్ కోర్టులో పిటిషన్ వేశారు. దేశ జాతీయ జెండాను అవమానించారని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వివరణ కోరుతూ నోటీసులిచ్చింది.