: ఆర్టీసీని నష్టపరుస్తున్న ప్రైవేటు బస్సులపై చర్యలు: హోంమంత్రి చినరాజప్ప


నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ఇందుకోసం ఆర్టీసీలో వంద రోజుల ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. కాకినాడ, రాజమండ్రికి వేసిన 35 కొత్త బస్సులను కాకినాడ బస్టాండులో ఈ రోజు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఆర్టీసీని నష్టపరుస్తున్న ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ రూ.700 కోట్ల మేర నష్టాల్లో ఉన్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News