: కర్నూలు, మంత్రాలయం సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న తుంగభద్ర
తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండిపోవడంతో... 1,89,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో, కర్నూలు, మంత్రాలయం వద్ద తుంగభద్ర భారీ వరద నీటితో ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ముంపు ప్రాంత ప్రజలను కర్నూలు జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.