: వాషింగ్టన్ లో తెలుగువారి అన్నదానం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మన తెలుగువారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (క్యాట్స్), హోమ్ ఫర్ హ్యుమానిటీ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సంస్థలకు చెందిన 42 మంది సభ్యులు డీసీ సెంట్రల్ కిచెన్ లో స్వయంగా వండిన శాకాహార భోజనాన్ని 4 వేల మంది నిరుపేదలకు వడ్డించారు. వాషింగ్టన్ డీసీలో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ... మానవత్వాన్ని చాటుకుంటున్నారు మన తెలుగువారు.