: కష్టాలు తెచ్చిపెట్టిన కాశీయాత్ర... డబ్బుల్లేక యాతన పడుతున్న తెలుగు వారు
కాశీయాత్ర కష్టాలు కొనితెచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కాశీ యాత్రకు బయలుదేరిన 40 మంది నెల్లూరు, ఒంగోలు వాసులు కోల్ కతా వద్ద కలుషిత ఆహారం తీసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో 12 మంది హౌరాలోని మార్వాడి స్ట్రీట్ సొసైటీ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తీసుకెళ్లిన డబ్బు వీరి వైద్యానికి ఖర్చైపోవడంతో తిరుగు ప్రయాణానికి ఛార్జీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాత్రికులను ఆదుకోవాలని ఉదయగిరి ఎమ్మెల్యే రామారావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.