: నేపాల్ లో మోడీకి ఘన స్వాగతం


రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఖాట్మండు విమానాశ్రయం చేరుకున్న మోడీకి నేపాల్ ప్రభుత్వ వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ పర్యటనలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ఆర్థిక సంబంధిత విషయాలపైనా నేపాల్ ప్రధాని కొయిరాలాతో మోడీ చర్చలు జరుపుతారు. నేపాల్ కు విద్యుత్ విక్రయానికి సంబంధించిన ఒప్పందంపై కూడా మోడీ సంతకం చేసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News