: కాంగ్రెస్ నేతను టీఆర్ఎస్ లో చేరనివ్వొద్దంటూ ఆందోళన
టీఆర్ఎస్ లో చేరదామనుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుదర్శన్ రెడ్డిని పార్టీలోకి రానివ్వొద్దంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ లో టీఆర్ఎస్ కౌన్సిలర్లు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. ఆయనను పార్టీలోకి అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.