: ఇక అమ్మ 'ఆముదం' సూపర్ మార్కెట్లు
తమిళనాడులో సీఎం జయలలిత ఏఐఏడీఎంకే నేతలకు 'అమ్మ'. ఆ అమ్మ పేరిట ఇప్పటికే బడ్జెట్ క్యాంటీన్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ఫార్మసీలు... ఇలా ఎన్నో ఏర్పాటైన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ మార్కెట్లు నెలకొల్పాలని నిర్ణయించుకున్నట్టు జయలలిత తెలిపారు. అమ్మ 'ఆముదం' సూపర్ మార్కెట్లుగా వీటిని పిలుస్తారు. మొత్తం 300 సూపర్ మార్కెట్ల ఏర్పాటుకు గాను రూ.37.17 కోట్లు వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు.