: టీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 6న ఘనంగా జయశంకర్ జయంతి
ఈ నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. సమావేశం ముగిసిన అనంతరం టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, హైకోర్టు, ఉన్నత విద్యామండలి, ఆర్టీసీని విభజించాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పై ఉన్నత విద్యామండలి పరిమితికి మించి వ్యవహరిస్తోందన్నారు. ఆర్టీసీలో తెలంగాణ లాభాలతో ఆంధ్రా నష్టాలను పూడ్చుతున్నారని ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ ఆరోపించారు.