: యూనియన్ బ్యాంకుకు లాభాలొచ్చాయ్!
అవును... యూనియన్ బ్యాంకుకు లాభాలొచ్చాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభాలను మూటగట్టుకుంది. అందరి అంచనాలను మించి ఫస్ట్ క్వార్టర్ లో రూ.664.11 కోట్ల నికర లాభాన్ని యూనియన్ బ్యాంక్ నమోదు చేసింది. గతేడాది తొలి త్రైమాసికంలో నికరలాభం రూ. 560.22 కోట్లతో పోలిస్తే... ఈసారి 18.54 శాతం అధికంగా లాభాల వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో ఆదాయం రూ.7613.53 కోట్ల నుంచి 12.27 శాతం వృద్ధితో రూ.8547.56 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,910 కోట్ల నుంచి రూ.2117 కోట్లకు చేరింది. నికర వడ్డీ 10.84 శాతం పెరిగింది. బ్యాంక్ మంచి లాభాలను నమోదు చేయడంతో యూనియన్ బ్యాంక్ షేరు ధర 3 శాతం పెరిగి... రూ.197.30లకు చేరుకుంది.