: జూనియర్ ఎన్టీఆర్ తో ఇది మూడో సినిమా...నేను డిజప్పాయింట్ అయ్యా: సమంత
జూనియర్ ఎన్టీఆర్ తో తాను మూడో సినిమా చేశానని, అది చాలా పెద్ద విషయమని నటి సమంత తెలిపారు. ‘రభస’ ఆడియో ఫంక్షన్ లో ఆమె మాట్లాడుతూ... జూనియర్ ఎన్టీఆర్ లైవ్ పాట పాడతారని చాలా ఎదురు చూశానని, ఆయన పాట పాడకపోవడంతో చాలా డిజప్పాయింట్ అయ్యానని తెలిపారు. అభిమానులు కూడా కోరుకుంటున్నారని, ఓసారి పాడితే వినాలనుందని జూనియర్ ఎన్టీఆర్ ను కోరారు. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో సినిమా చాలా పెద్ద హిట్ కావాలని సమంత ఆకాంక్షించారు.