: అప్పటి కంటే ఇప్పుడే ఎన్టీఆర్ యంగ్ గా ఉన్నారు: రాజమౌళి


'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాలో కంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యువకుడిలా కనిపిస్తున్నాడని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసించారు. ‘రభస’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ... బెల్లంకొండ సురేష్ ‘ఆది’తో వీవీ వినాయక్ ను తీసుకొచ్చి, తారక్ ను స్టార్ హీరోను చేశారని అన్నారు. నందమూరి ఆడియో ఫంక్షన్ కొస్తేనే మంచి ఎనర్జీ ఉంటుందని ఆయన తెలిపారు. ఫంక్షన్ లో ఏమీ మాట్లాడకూడదు... ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చేద్దామని అనుకున్నా... వచ్చిన వెంటనే ఏదో కరెంట్ ఎక్కించేసి మాయ చేసి ఏదో ఒకటి మాట్లాడేలా చేస్తారని ఆయన నవ్వుతూ నిష్టూరమాడారు. తారక్ సినిమాకు ఏఏ హంగులు కావాలో, అవన్నీ రభస ట్రైలర్ లో కనబడుతున్నాయని రాజమౌళి అభిప్రాయపడ్డారు. కొడుకు పుట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ రెట్టింపు ఆనందంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ సినిమా మంచి ఆదరణ పొందుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News