: ఇంటిపై మరో గది నిర్మించుకుంటే అక్రమమా?: సబితా ఇంద్రారెడ్డి


సొంత ఇంటిపై మరో గది నిర్మించుకుంటే అక్రమమా? అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిపై అదనపు గదులు కట్టుకున్న వారి ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాదు నగరంలోని అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతున్నారని సబిత చెప్పారు. ప్రభుత్వ పెద్దలు తమ విమర్శలను పాజిటివ్ గా తీసుకోవాలని ఆమె హితవు పలికారు.

  • Loading...

More Telugu News