: పరస్పరం అభివాదం చేసుకున్న చంద్రబాబు, జగన్
గవర్నర్ రాజ్ భవన్ లో ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్ హాజరయ్యారు. వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడినప్పుడు పరస్పరం చిరునవ్వుతో అభివాదం చేసుకున్నారు. రాజకీయ విరోధులైన బాబు, జగన్ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం అరుదే. కాగా, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఇఫ్తార్ విందుకు హాజరు కాలేదు.