: బ్రోకర్లే పార్టీని ముంచారు: మల్ రెడ్డి రంగారెడ్డి
కాంగ్రెస్ పార్టీని బ్రోకర్లే ముంచారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. హైదరబాదులో ఆయన మాట్లాడుతూ, గాంధీ భవన్ చుట్టూ తిరిగే బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని అన్నారు. పార్టీ కోసం కష్టపడేవారిని కాదని లాబీయింగ్ చేసేవారికి ప్రాధాన్యతనిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని ఆయన ఎత్తిచూపారు. గ్రూపు రాజకీయాలు మానకపోతే పార్టీకి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. వాస్తవాలు మరుగున పెట్టకుండా సోనియా గాంధీకి పొన్నాల వివరిస్తే పార్టీ బతికి బట్టకడుతుందని సూచించారు.