: స్త్రీలోలుడు... అందుకే భార్యను చంపేశాడు!


ఉత్తరప్రదేశ్ బిస్కెట్ కింగ్ ఓంప్రకాశ్ దాసాని కోడలు జ్యోతి దాసానిని ఆమె భర్తే హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అనేక విషయాలు కనుక్కున్నారు. పియూష్ దాసాని భయంకరమైన స్త్రీలోలుడని పోలీసులు వెల్లడించారు. పెళ్లయిన తరువాత పక్కింట్లో ఉండే పాన్ మసాలా కంపెనీ యజమాని కుమార్తె మనీషా మఖీజాను ముగ్గులోకి దింపడమే కాకుండా పలువురు యువతులతో అక్రమ సంబంధాలు నెరిపాడు. అతడి కాల్ లిస్టు సేకరించిన పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు. గత రెండు నెలల కాలంలో మనీషా మఖీజాకు 663 సార్లు ఫోన్ చేశాడు. తమ కంపెనీలో పని చేసే మరో యువతికి 330 సార్లు ఫోన్ చేశాడు. ఇలాంటి ఫోన్ కాల్స్ చాలా ఉన్నాయట. అది పక్కన పెడితే తన ప్రియురాలితో నిత్యం మాట్లాడేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మనీషా మఖీజాకు ఐదు సిమ్ కార్డులు నకిలీ అడ్రస్ లతో కొనిచ్చాడట. వీరి వ్యవహారం పసిగట్టి అడ్డుపడుతుండడమే కాకుండా, విషయాన్ని కుటుంబ సభ్యుల ముందు బట్టబయలు చేసిందన్న కోపంతో భార్యను ప్రియురాలి డ్రైవర్, అతడి స్నేహితుడి సాయంతో కసిదీరా 14 సార్లు పొడిచి చంపాడు. ఈ విషయాలు తెలిసిన తరువాత విచారణ కోసం న్యాయస్థానానికి పియూష్ హాజరవ్వగా న్యాయవాదులు మూడు సార్లు దాడి చేశారు.

  • Loading...

More Telugu News