: ఇండియాలో టీసీఎస్ నెంబర్ వన్
టీసీఎస్ మరో ఘనతను సొంతం చేసుకుంది. స్టాక్ మార్కెట్ క్యాపిటల్ 5 లక్షల కోట్ల రూపాయలకు చేరడంతో, భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ కాపిటల్ కలిగిన తొలి కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అవతరించింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తరువాత టీసీఎస్ క్యాపిటల్ 5,06,703.34 (84 మిలియన్ డాలర్లు) కోట్లకు చేరింది. స్టాక్ మార్కెట్ లో 2004లో లిస్టయిన తరువాత ఈ ఘనత సాధించడం ఇదే ప్రధమం. టీసీఎస్ తరువాతి స్థానాల్లో ఇన్ఫోసిస్ (1,92,196.84 కోట్లు), హెచ్ సీఎల్ టెక్నాలజీ (1,07,880.18 కోట్లు), విప్రో (1,40,474.31 కోట్లు), టెక్ మహీంద్రా (50, 374,76 కోట్లు) అత్యధిక క్యాపిటల్ వాటాలు కలిగిన కంపెనీలుగా స్టాక్ మార్కెట్ లో స్థానం సంపాదించాయి.