: సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రులను కోరాం: మంత్రి గంటా


ఢిల్లీలో ఇవాళ (బుధవారం) ఉదయం నుంచి కేంద్రమంత్రులతో భేటీ అయ్యామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎంసెట్ కౌన్సిలింగ్, 1956 స్థానికత గురించి మాట్లాడామని ఆయన అన్నారు. మంత్రులు గంటా, కామినేనితో కూడిన ఆంద్రప్రదేశ్ అఖిలపక్షం ఢిల్లీ వెళ్లిన విషయం విదితమే. తెలంగాణ ప్రభుత్వ చర్యలను వివరించామని, సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రులను విన్నవించామని గంటా చెప్పారు. ఎంసెట్ కౌన్సిలింగ్ పై విద్యార్థులు సతమతమవుతున్నారని ఆయన అన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గంటా అన్నారు.

  • Loading...

More Telugu News