నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. లేక్ వ్యూ అతిథి గృహంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభంకానుంది. ఇసుక తవ్వకం బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించే విషయంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.