: పట్టపగలు...నగర నడిబొడ్డున డబ్బు లాక్కుపోయారు!


పట్టపగలు విశాఖపట్టణం నడిబొడ్డున దొంగలు దోపిడీకి తెగబడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కు కూతవేటు దూరంలోని పాత సెంట్రల్ జైల్ రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రధాన కార్యాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుడైన ఓ వ్యక్తి తన కోడలితో పాటు వచ్చి 5 లక్షల రూపాయల నగదును బ్యాంకు నుంచి డ్రా చేసుకున్నాడు. అప్పటికే బ్యాంకులో మాటు వేసిన దొంగ వారిని ఫాలో కావడం మొదలు పెట్టాడు. వారు బ్యాంక్ నుంచి బయటకు రాగానే మరో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి అతని చేతిలోని కవరును లాక్కుని పరారయ్యారు. డబ్బు యజమాని షాక్ కు గురై అరిచేంతలో వారు అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించారు. సీసీ పుటేజ్ గమనించిన పోలీసులు దొంగల్లో ఓ వ్యక్తిని గుర్తు పట్టారు. తొందర్లోనే కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News