: గ్రామస్తులకు భయపడి కాలేజీలో దాక్కున్న అమాత్యుడు
బీహార్ పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి బైద్యనాథ్ సాహ్నీకి సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. సమస్తిపూర్ జిల్లాలోని నికాశ్ పూర్ గ్రామంలో ఓ పెట్రోల్ పంప్ కు శంకుస్థాపన చేసేందుకు వెళ్ళిన ఆయనకు గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాలేజీ భూముల్లో పెట్రోల్ పంప్ ను ఆ గ్రామస్తులు వ్యతిరేకించారు. అయినాగానీ, అమాత్యుల వారు అడుగు ముందుకే వేశారు. దీంతో, వారు కర్రలు చేతబట్టి దాడికి దిగడంతో బతుకుజీవుడా అంటూ సాహ్నీ కాలేజిలోని ఓ గదిలో దూరి తలుపేసుకున్నారు. ఆగ్రహించిన గ్రామస్తులు అక్కడ నిలిచి ఉన్న ట్రాక్టర్లను దగ్ధం చేశారు. అనంతరం సాహ్నీ మాట్లాడుతూ, సంఘవిద్రోహక శక్తులతో చేతులు కలిపిన బీజేపీ ఈ ఘటనకు కారణమైందని ఆరోపించారు.