: నట్వర్ సింగ్ ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ స్పందన
'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్: యాన్ ఆటోబయోగ్రఫీ' అన్న పేరుతో కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సంబంధించిన పలు విషయాలను వరుసగా బహిర్గతం చేయడాన్ని మన్మోహన్ ఖండించారు. అప్పట్లో ప్రధాని కార్యాలయం నుంచి ముఖ్యమైన ఫైళ్లు సోనియాకు పంపినట్లు నట్వర్ తన పుస్తకంలో చెప్పినదంతా అవాస్తవమేనని ఆయన అన్నారు. ఎలాంటి ఫైళ్లు సోనియాకు పంపలేదని మన్మోహన్ చెప్పారు. కొన్ని ప్రైవేటు విషయాలను వ్యాపార ప్రయోజనాల కోసం బయటకి చెప్పకూడదని మన్మోహన్ నట్వర్ కు సూచించారు.