: ఆస్ట్రేలియాలో ఆల్కహాలిక్స్ భారీ సంఖ్యలో మరణిస్తున్నారు


ఆల్కహాల్ ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తోంది. మద్యం విరివిగా వినియోగించే ఆస్ట్రేలియాలో రోజూ 15 మంది కేవలం ‘మందు’ కారణంగానే మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. విక్ హెల్త్ ఫౌండేషన్ ఫర్ ఆల్కహాల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 2010 నుంచి నమోదైన గణాంకాల ఆధారంగా మద్యం తాగిన కారణంగా 5,554 మంది మృతి చెందగా, 1,57,132 మంది ఆసుపత్రి పాలయ్యారని వెల్లడించింది. మద్యం కారణంగా ఇటీవలి కాలంలో మృతుల సంఖ్య బాగా పెరిగిందని ఆ సంస్థ స్పష్టం చేసింది. మద్యం కారణంగా గత దశాబ్ద కాలంలో మరణాలు 62 శాతం పెరిగాయని తెలిపింది. మద్యం వాడకం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆస్ట్రేలియా దుష్పలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.

  • Loading...

More Telugu News