: తల్లి పదానికే కళంకం తెచ్చింది
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం మూలతండాకు చెందిన హనుమంతు భార్య మరణించడంతో మేనకోడలు చంద్రకళను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలానికి చంద్రకళ అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అనుబంధానికి కుమార్తెలు అడ్డం వస్తున్నారనే కారణంతో పెద్ద కుమార్తెను కడతేర్చింది చంద్రకళ. చిన్న కుమార్తెను ఒంగోలుకు చెందిన ఓ కుటుంబానికి అమ్మేసింది. అంగన్ వాడీ టీచర్ జోక్యంతో విక్రయించిన శిశువును దేవరకొండలోని శిశుమందిర్ కు అప్పగించింది. తరువాత హనుమంతును పిలిచి అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో బాలికను తీసుకువెళ్లారు. పెద్ద కుమార్తెను హత్యచేసిన కేసులో విచారణ కోసం ఆమెను రిమాండుకు అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పసిబాలికతో వచ్చిన ఆమెను చూసిన న్యాయస్థానం ఆమెను రిమాండ్ కు అప్పగిస్తే బాలిక సంరక్షణ బాధ్యత ఎవరిది? పోలీసులు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకున్నారో న్యాయస్థానానికి వివరిస్తే ఆమెను రిమాండుకు అప్పగిస్తామని చెప్పి, ఆమెను తిప్పిపంపింది.