: భూముల విలువ పెంపు ప్రతిపాదనను తిరస్కరించిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాల్లోని భూముల విలువను 30 శాతం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. ఈ మేరకు తన వద్దకు వచ్చిన ఫైలును తిప్పి పంపారు. ఇప్పటికే ఈ ఫైలుపై ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తి సంతకం చేశారు. భూముల విలువ పెంపుపై పునరాలోచించాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. భూముల విలువను పెంచితే కొత్త రాజధాని నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతాయని... అలాగే ప్రజలపై కూడా ఆర్థిక భారం పడుతుందని బాబు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News