: పూణె ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
పూణె జిల్లాలోని మలిన్ గ్రామంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఇప్పటివరకు ఎనిమిది మందిని రక్షించారు. విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.