: భూపంపిణీకి 10 లక్షల ఎకరాలు అవసరం
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద దళితులకు మూడు ఎకరాల చొప్పున భూపంపిణీ చేయాలంటే 10 లక్షల ఎకరాల భూమి అవసరమని పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని నిరుపేద దళితులు 34 శాతం వరకు ఉన్నారని చెప్పారు. ఎన్నికల హామీలో భాగంగా నిరుపేద దళితులకు భూపంపిణీ చేస్తామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.