: నీట మునిగిన జూరాల పవర్ ప్రాజెక్టు... రూ. కోట్లలో నష్టం
మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 98,530 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318.576 మీటర్లు కాగా... ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు 7 గేట్లు ఎత్తివేసి 70,623 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ఒక్కసారిగా నీరు విడుదల కావడంతో... లోయర్ జూరాల పవర్ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. నాలుగో యూనిట్ ఇన్ టేక్ గేట్ లీకేజీతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఆరు విద్యుత్ యూనిట్లు నీట మునిగాయి. ప్రమాద సమయంలో విద్యుత్ యూనిట్లలో 70 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే, వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో రూ. కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది.