: మహిళను తాకాడని... మూడు నెలల జైలు శిక్ష


మనదేశంలో అత్యాచారాలు జరుగుతుంటేనే ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన ఉండడంలేదు. ఇక, మహిళలను తాకితే ఎవరు పట్టించుకుంటారు? కానీ, అక్కడ మాత్రం అలా కాదు! మహిళను తాకాడంటూ వచ్చిన అభియోగంపై మూడు నెలల కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. దుబాయ్ లోని జెబెల్ అలీ మెట్రో రైల్వేస్టేషనులో ఈ ఏడాది మార్చిలో 40 ఏళ్ల భారత మహిళను జేకే (26) అనే యువకుడు బహిరంగంగా తాకాడు. అయితే ఎస్కలేటర్ పై నుంచి హఠాత్తుగా పడిపోయానని, ఆమెను తాకాలన్న ఉద్దేశం తనకు ఏ కోశానా లేదని జేకే న్యాయస్థానానికి విన్నవించాడు. అతను ఉద్దేశపూర్వకంగానే తనపై పడ్డాడని, తాను నిలదీసేసరికి పడిపోయానని సాకు చెబుతున్నాడని ఆమె ఆరోపించింది. దీంతో మొదటి తప్పుగా భావించిన న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తి కాగానే దేశం విడిచిపోవాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News