: రేణుకా చౌదరి సీమాంధ్ర వ్యక్తి... జిల్లాలో అడుగుపెట్టనీయం: ఖమ్మం కాంగ్ నేతలు
కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సీమాంధ్ర ఎంపీ అని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. హైదరాబాదు గాంధీభవన్ లో జరిగిన ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశంలో స్థానిక నేతలు రేణుకా చౌదరిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమని వారు శపథం చేశారు. ఆమె సీమాంధ్రలో పనిచేయాలని, తక్షణం ఖమ్మం జిల్లాకు కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడంపై పోరాటం చేయాలని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు వారు సూచించారు. సీపీఐతో పొత్తు, అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్ల వల్లే కాంగ్రెస్ ఓటమిపాలైందని వారు వివరించారు.