: 2,15,336 మంది విద్యార్థుల ఆశలకు జీవం పోసిన ఉన్నత విద్యామండలి


ఉన్నత విద్యామండలి వేలాది మంది విద్యార్థుల ఆశలకు జీవం పోసింది. పరీక్ష రాసి ఫలితం వెలువడినా భవితవ్యంపై స్పష్టత రాని ఎంసెట్ విద్యార్థులకు శుభవార్త వినిపించింది. ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. మొదటి రోజు 1 నుంచి 5 వేల ర్యాంక్‌ వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ లో 34, తెలంగాణలో 23 కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కౌన్సిలింగ్ కు సుమారు 2,15,336 మంది విద్యార్థులు హాజరుకానున్నారని సమాచారం. వీరంతా గత మూడు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కౌన్సిలింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులకు ఊరట కలిగింది.

  • Loading...

More Telugu News