: విశాఖ జిల్లాలోని బోయపాలెంలో షిర్డీ సాయి వార్షికోత్సవాలు
విశాఖ జిల్లా బోయపాలెంలోని షిర్డీ సాయి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయినాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం అర్చకులు తులసీ దళాలు, పుష్పాలతో సహస్ర నామార్చన వైభవంగా జరిపారు. అంతకు మునుపు బాబా విగ్రహాన్ని పంచామృతాలతో అబిషేకించారు. ఈ వార్షికోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై బాబా ఆశీస్సులు పొందారు.