: ‘మాసాయిపేట’ బాధిత కుటుంబాలకు లోకేష్ ఆర్థిక సాయం
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో చిన్నారులను కోల్పోయిన కుటుంబాలను టీడీపీ యువనేత లోకేష్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని వేర్వేరు గ్రామాల్లో కూడా బాధిత కుటుంబాలను నేరుగా ఇంటికి వెళ్లి లోకేష్ పరామర్శిస్తున్నారు. వారికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేస్తున్నారు.