: చంద్రబాబు శ్వేతపత్రాలన్నీ అవాస్తవాలు: బొత్స


ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... శ్వేతపత్రాలన్నీ అవాస్తవాలేనని వ్యాఖ్యానించారు. ఏపీ దివాళా తీసిందంటూ ప్రజలను బాబు మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన బొత్స, జలయజ్ఞంలో అవినీతి జరిగితే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అటు ఇంజినీరింగ్ అడ్మిషన్లు, ఉద్యోగుల విభజన, ఫీజు రీయింబర్స్ మెంట్ విషయాల్లో టీడీపీ, టీఆర్ఎస్ లు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయన్నారు. వీటన్నింటినీ కేంద్రం పరిష్కరించాలని బొత్స అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News