: ఖమ్మం జిల్లాలో గిరిజనులకు, అటవీ అధికారులకు మధ్య తీవ్రవాగ్వాదం
ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం నెహ్రూ నగర్ లో గిరిజనులకు, అటవీ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇల్లందు మండలంలో ఉన్న అటవీ భూమిలో గిరిజనులు గత కొంతకాలంగా సాగు చేసుకుంటున్నారు. అయితే వారు సాగు చేసుకోవడానికి వీలు లేదంటూ అటవీ అధికారులు ఈ రోజు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాలు ఏమాత్రం తగ్గకపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉంది.