: ఇక స్మార్ట్ ఫోన్లతో హోటల్ గది తాళాలు తీయొచ్చు


హిల్టన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఆ హోటళ్ళలో సదుపాయాలు, అక్కడ అందించే వివిధ రకాల వంటకాలు, గౌరవమర్యాదలకు లోటు రానీయని సిబ్బంది... ఇలా హిల్టన్ హోటళ్ళు వరల్డ్ సెలబ్రిటీలకు ఫేవరెట్లుగా మారాయి. ఇప్పుడా హోటల్ యాజమాన్యం తమ అతిథులకు మరింత సౌకర్యవంతంగా ఉండే సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ సాంకేతికత ద్వారా ఇకపై హోటల్ గదులను తెరిచేందుకు తాళాలు అవసరం ఉండదట. ఎంచక్కా స్మార్ట్ ఫోన్ సాయంతో డోర్ లాక్ తీయొచ్చని హిల్టన్ వర్గాలంటున్నాయి. ఇందుకోసం డిజిటల్ ఫ్లోర్ ప్లాన్ రూపొందించాల్సి ఉంటుంది. తాాజా సౌకర్యంతో చెక్-ఇన్ కోసం లైన్లో నిలబడాల్సిన అగత్యం ఉండదు, నేరుగా తమ గదికి వెళ్ళిపోవచ్చు. ఎంతో సురక్షితం, విశ్వసనీయమైన ఈ టెక్నాలజీ అభివృద్ధి దశలో ఉందని, 2015 చివరికల్లా అందుబాటులోకి తెస్తామని హిల్టన్ వరల్డ్ వైడ్ అధ్యక్షుడు, సీఈఓ క్రిస్టోఫర్.జె.నసెట్టా తెలిపారు.

  • Loading...

More Telugu News