: జూరాలకు జల కళ


జూరాల ప్రాజెక్టుకు జల కళ వచ్చింది. మొన్న నారాయణపూర్ జలాశయం నుంచి విడుదల చేసిన నీరు 48 గంటల తర్వాత జూరాలకు చేరుకోవడం మొదలైంది. ప్రస్తుతానికి 7,380 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.45 మీటర్లు కాగా ప్రస్తుతం 315.30 మీటర్లకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో జలాశయం పూర్తిగా నిండుతుందని అధికారులు తెలిపారు. పరిస్థితిని బట్టి ఇవాళ లేదా రేపటినుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పారు. ముందుగా రెండు యూనిట్ల నుంచి 80 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు.

  • Loading...

More Telugu News