: ఏపీలో ఆగస్టు 1 నుంచి 30% పెరగనున్న భూముల విలువ


ఆగస్టు 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో భూముల విలువ 30 శాతం మేర పెరగనుంది. దీనికి సంబంధించిన దస్త్రంపై ఇప్పటికే ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంతకం చేశారు. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు టేబుల్ పై ఉంది. ఆయన సంతకం చేయగానే భూముల సరికొత్త విలువలు అమల్లోకి వస్తాయి. అయితే ప్రస్తుత పెంపు నగరాలు, పట్టణాలకే వర్తించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది ఎలాంటి పెంపు ఉండదు. ప్రస్తుతం సీమాంధ్రలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రియలెస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి తదితర నగరాల్లో భూముల ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. కృత్రిమంగా పెరుగుతున్న ధరలను కూడా సంబంధిత శాఖ పరిగణనలోకి తీసుకుంది. దీంతో 30 శాతం మేర భూముల విలువను పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే భూముల విలువ పెంపుకు సంబంధించిన ముసాయిదాలు సిద్ధం చేసి అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశించింది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ క్షణంలోనైనా సంతకం చేసే అవకాశం ఉంది. దీంతో, పెరిగిన భూముల విలువ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.

  • Loading...

More Telugu News