: ఆరుగురికి పునర్జన్మనిచ్చిన షీబా


పుట్టినవాడు మరణించక తప్పదు... మరణించినవాడు జన్మించక తప్పదు అంటూ కురుక్షేత్ర యుద్ధం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. అలాగే చెన్నైలోని ఓ మహిళ మరణించి తిరిగి జన్మించకుండానే పునర్జన్మ పొందింది. ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. చెన్నైలోని పాడి ప్రాంతానికి చెందిన వివాహిత ఎల్.షీబా పాత మహాబలిపురం రోడ్డు (ఓఎమ్‌ఆర్)లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈనెల 27న విధులను ముగించుకుని ద్విచక్రవాహనంపై వస్తుండగా, సాయంత్రం 5.30 గంటల సమయంలో అశోక్‌నగర్ పిల్లర్ వద్ద మరో బైక్ ను ఢీకొంది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమె బ్రెయిన్‌డెడ్ అయి కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని వైద్యులు ఆమె బంధువులకు వివరించారు. వారి అంగీకారంతో అవయవదానానికి ఏర్పాట్లు చేశారు. మియాట్ ఆసుపత్రికి 17 కిలోమీటర్ల దూరం ముగప్పేర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఒక రోగి గత కొన్నాళ్లుగా గుండెమార్పిడి కోసం ఎదురుచూస్తున్నాడు. రెండు వైద్యశాలల వైద్యులు గుండె మార్పిడికి సిద్ధమయ్యూరు. నగర పోలీస్ కమిషనర్ సాయంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా దారిపొడవునా వంద మంది కానిస్టేబుళ్లను బందోబస్తు ఉంచారు. సోమవారం అర్ధరాత్రి 12.50 గంటలకు మియాట నుంచి గుండెతో అంబులెన్స్ బయలుదేరి 17 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి కేవలం 8 నిమిషాల్లో చేరింది. ముగప్పేర్‌లో సిద్ధంగా ఉన్న వైద్యులు ఆగమేఘాలపై గుండెను అమర్చి అతనికి ప్రాణంపోశారు. షీబా నుంచి సేకరించిన కళ్లను శంకర్‌ నేత్రాలయ ద్వారా మరో ఇద్దరికి అమర్చారు. ఆమె రెండు కిడ్నీలను మరో ఇద్దరికి అమర్చారు, లివర్ మరొక రోగికి అమర్చి ఆమెను చిరంజీవిగా చేశారు. షీబా మరణించినా ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

  • Loading...

More Telugu News