: మత్స సంతోషికి 5 లక్షలు నజరానా


గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన తెలుగింటి అమ్మాయి మత్స సంతోషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మత్స సంతోషికి నజరానా ప్రకటించాలని క్రీడాశాఖ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సిఫారసు చేసింది. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు సంతోషికి ఏపీ ప్రభుత్వం 5 లక్షల రూపాయల నజరానా ప్రకటించినట్టు తెలిపారు. సంతోషి మరిన్ని పతకాలు సాధించాలని ముఖ్యమంత్రి కాంక్షించారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News