: నన్ను చంపడానికి కుట్ర జరుగుతోంది: డీఎస్ తనయుడు సంజయ్


తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ తనయుడు సంజయ్ ఆరోపించారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, గత కొంత కాలంగా తనను చంపేందుకు కొందరు వ్యక్తులు వెంబడిస్తున్నారని అన్నారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా ఎన్నికయ్యారు. సంజయ్ ఫిర్యాదుతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News