: తెలుగింటి తలుపు తట్టిన రజత పతకం
గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకంతో పాటు మరో పతకం భారత ఖాతాలోకి వచ్చి చేరాయి. 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషి కాంస్యపతకం సాధించింది. కాంస్యం సాధించిన సంతోషంలో సంతోషి వెలిగిపోతుండగా డోపింగ్ పరీక్షలు జరిగాయి. స్వర్ణం సాధించిన నైజీరియా వెయిట్ లిఫ్టర్ చికా అమలహా డోపింగ్ పరీక్షల్లో దోషిగా తేలింది. దీంతో కాంస్యం సాధించిన సంతోషికి రజత పతకం లభించగా, ఇదే పోటీల్లో సంతోషి తరువాత అత్యుత్తమ ప్రదర్శన చేసిన స్వాతి సింగ్ కు కాంస్య పతకం లభించింది. దీంతో భారత్ ఖాతాలో రజతం అదనంగా చేరగా, కాంస్యం భారత్ కే చెందిన స్వాతి దగ్గర పదిలంగా ఉంది.